Jobs with NCC: ఎన్‌సీసీలో 'సీ' స‌ర్టిఫికెట్ విద్యార్థుల‌కు ఉన్న‌త ఉద్యోగాలు..

చిత్తూరులో జ‌రిగిన ఎన్‌సీసీ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు తిరుపతి గ్రూపు కమాండర్‌ కల్నల్‌ యోగేష్‌ డోంగ్రా కోఠి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ..

చిత్తూరు: ఎన్‌సీసీలో సీ సర్టిఫికెట్‌ పొందే విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తిరుపతి గ్రూపు కమాండర్‌ కల్నల్‌ యోగేష్‌ డోంగ్రా కోఠి తెలిపారు. ఆయన గురువారం చిత్తూరులో నిర్వ‌హించిన‌ ఎన్‌సీసీ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీలో 'సీ' సర్టిఫికెట్‌ పొందిన కేడెట్లు ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు.

Online Evaluation: ఈసారి ప‌రీక్ష‌ల‌ మూల్యాంక‌నం ఆన్‌లైన్ విధానంలో..

అగ్నివీర్‌, పారామిలిటరీ, డిఫెన్స్‌ ఫోర్స్‌లోనూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎన్‌సీసీలో శిక్షణ పొందిన ఎంతో మంది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. అనంతరం ఎన్‌సీసీ కేడెట్ల ఫైరింగ్‌ శిక్షణను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ క్యాంప్‌ కమాండర్‌ లోకనాథన్‌, అధికారులు ప్రసాద్‌రెడ్డి, కార్తీక్‌, గిరిధర్‌ నాయక్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Gurukulam Counseling: గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌..

#Tags