Four Days Holidays For Schools and Colleges : ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు ఇచ్చారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం స్కూల్‌, కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో మేడారం జాతర ప్రసిద్ధి గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మేడారం జాతర జరిగే ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని అందరికి ఈ సెలవులు వర్తించవు. కొన్ని జిల్లాల వారికి మాత్రమే వ‌ర్తిస్తాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతరగా మేడారం జాతర ప్రసిద్ధికెక్కింది. వరంగల్ జిల్లాలో ఇప్ప‌టికే స్కూల్స్‌,కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చారు. అలాగే రాష్ట్ర‌వ్యాప్తంగా క‌నీసం రెండు నుంచి మూడు రోజులు పాటు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

☛ Sammakka Sarakka Jatara : నాలుగు రోజులు.. 4 ఘట్టాలు.. మహాజాతర చరిత్ర ఇలా..

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా..
రేపటి నుంచి అనగా ఫిబ్రవరి 21 నుంచి వనదేవతల జాతర ప్రారంభం కానుంది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోనూ మేడారం జాతరకు భక్తులు వస్తారంటే దాని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మహా జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సహకరించాలని పొన్నం కోరారు.

☛ Telangana: ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర ఏది?

అలానే హైదరాబాద్, హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లి మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా హెలిటాక్సీ సంస్థ.. తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్‌ సహకారంతో హెలికాప్టర్‌ సేవలను అందించేందుకు రెడీ అయ్యింది. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ సంస్థ హెలికాప్టర్‌ సేవలు అందించనుంది. అలానే ఈ జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారి కోసం పోలీస్‌‌ శాఖ రూట్‌ మ్యాప్‌ను ప్రకటించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా మేడారం చేరుకునేందుకు ఈ రూట్ మ్యాప్‌ను వెల్లడించారు. వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు సెల‌వులు రావ‌డంతో స్కూల్స్‌, కాలేజీల విద్యార్థులు ఆనందంతో ఉన్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని చాలా జిల్లాల ప్ర‌జ‌లు మేడారం జాతరకు వెళ్లెందుకు రెడీ అవుతున్నారు.

ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్ 

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..

☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags