Students Health : అస్వ‌స్థ‌తకు గురైన 800 మంది విద్యార్థులు.. త‌ల్లిదండ్రుల ఆవేద‌న‌.. కార‌ణం!

గ‌త కొద్దిరోజులుగా ప‌లు పాఠాశాల‌ల్లో, క‌ళాశాల‌ల్లోని విద్యార్థుల‌కు ఫుడ్ పాయిజ‌న్ అయిన ఘ‌ట‌న‌లు ఎక్క‌వ శాతంలోనే వ‌చ్చాయి.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: గ‌త కొద్దిరోజులుగా ప‌లు పాఠాశాల‌ల్లో, క‌ళాశాల‌ల్లోని విద్యార్థుల‌కు ఫుడ్ పాయిజ‌న్ అయిన ఘ‌ట‌న‌లు ఎక్క‌వ శాతంలోనే వ‌చ్చాయి. కొన్నిసార్లు ఆహారంలో నాణ్య‌త ఉండ‌క‌పోవ‌డం, నిల్వ ఉంచిన‌, నాసిర‌కం ఆహారం తిన‌డంతో ఇలా ఫుడ్ పాయిజ‌నింగ్ అవుతోంది. దీంతో విద్యార్థులు ఆస్ప‌త్రి బారిన ప‌డుతున్నారు.

MBBS Admissions: స్విమ్స్‌లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం

ఇలాగే, తాజాగా మ‌రో పాఠ‌శాల‌లో జ‌రిగింది. ఏలూరు జిల్లాలోని నూజివీడ్ ట్రిపుల్ ఐటీ క‌ళాశాల‌లో ఒకేసారి ఏకంగా 800 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. తొలి రోజు 342 విద్యార్థుల‌కు అయితే, ఇలా పెరుగుతూ మూడో రోజు ఏకంగా పూర్తిస్థాయిలో 800 మంది విద్యార్థులు ఆస్ప‌త్రి బారిన ప‌డ్డారు. విద్యార్థుల‌కు నాణ్య‌మైన ఆహారం లేక ఇలా రోజుకొక‌రు జ్వరం, వాంతులు, క‌డువు నొప్పి వంటి ఇబ్బందుల‌ను ఎదురుకుంటున్నార‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే, కాకినాడ జిల్లాలోని బాలిక‌ల గురుకులంలో 62 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజ‌న్‌తో అనారోగ్యానికి గురైయ్యారు.

RBI Quiz: ఆర్‌బీఐ క్విజ్.. రూ. 10 లక్షలు గెలుచుకునే అవకాశం

విద్యార్థుల గురుకులంలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే ఉందని, వారికి నాణ్యమైన ఆహారం అందించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని, దీనిపై ప్ర‌భుత్వ స్పందించాలని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య విష‌యంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను ఆదేశించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

Top 10 Central Universities in India: దేశంలోని టాప్‌-10 యూనివర్సిటీల్లో హెచ్‌సీయూకు చోటు

#Tags