Diwali Schools and Colleges Holiday Change: దీపావళి సెలవు మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు కూడా హాలిడేస్
అయితే ఈ పండుగ ఆదివారం(నవంబర్ 12వ తేదీ) రోజున వచ్చింది. ఇటు స్కూల్స్, కాలేజీల విద్యార్థులతో పాటు.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కుడా నిరాశలో ఉన్న విషయం తెల్సిందే.
➤ గుడ్‌న్యూస్.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?
వరుసగా రెండు రోజులు పాటు సెలవు..
అయితే వీరి కోసం ప్రభుత్వం నేడు శుభవార్త చెప్పింది. ఈ సెలవును అక్టోబర్ 13వ తేదీకి (సోమవారం) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రెండు రోజులు పాటు సెలవు ఉండనున్నాయి.
తెలంగాణలోని..
అలాగే తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు కూడా అక్టోబర్ 13వ తేదీకి (సోమవారం) సెలవు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీపావళి పండుగకు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి దీపావళి పండుగ నవంబర్ 12నే జరుపుకోవాలని పంచాగకర్తలు అంటున్నారు. మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది. దీంతో నవంబర్ 12వ తేదీనే దీపావళి పండుగని వేద పండితులు స్పష్టత ఇస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నవంబర్ 13వ తేదీ (సోమవారం)న కూడా సెలవు ఇవ్వడంతో స్కూల్ విద్యార్థులతో పాటు.. ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.