Distance Education: దూరవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

పుట్టపర్తి అర్బన్‌: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (దూర విద్యా విధానం) ద్వారా 2024–25 సంవత్సరానికి సంబంధించి పది, ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలులో ఓపెన్‌ స్కూల్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌ రవీంద్రనాథ్‌, జిల్లా కోఆర్డినేరట్‌ లాజరు, నాగరాజు తదితరులతో కలిసి ప్రవేశాలకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతి, 15 ఏళ్లు పూర్తయిన వారు ఇంటర్‌ చేరేందుకు అర్హులన్నారు. ఆగస్టు 27వ తేదీ వరకూ దరఖాస్తులకు అవకాశం ఉందన్నారు. రూ.200 అపరాధ రుసుముతో సెప్టెంబర్‌ 4 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కోర్సుల్లో చేరే వారికి ఉచిత పాఠ్యపుస్తకాలు, సులభమైన అభ్యసన సామాగ్రి ఇంటికే పంపనున్నట్లు వెల్లడించారు.

NEET Paper leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు..‘మాస్టర్‌మైండ్‌’ అరెస్ట్‌

అలాగే జ్ఞానదాత యూట్యూబ్‌ ఛానల్‌, ఏపీ ఓపెన్‌ స్కూల్‌ .ఏపీ.గోవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా కంటెంట్‌ సదుపాయం ఉంటుందన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌, మాజీ సైనికోద్యోగులకు అడ్మిషన్‌ ఫీజు రాయితీ ఉంటుందన్నారు.
 

#Tags