Staff Nurse Counselling : కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌ల నియామకాల కౌన్సెలింగ్ ప్రారంభం.. రోజుకు..

కడప రూరల్‌: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌ల నియామకాల కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యాయి. పులివెందుల, మదనపల్లె, ఆదోని మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 206 మందిని ఈ నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. అందులో భాగంగా తొలి రోజు మంగళవారం ఎంపికైన 50 మంది అభ్యర్థులకు గాను 34 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.

Guest Lecturer Posts : ప్ర‌భుత్వ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో గెస్ట్ లెక్చ‌రర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై. శ్రీనివాసులు మాట్లాడుతూ 5వ విడత కౌన్సెలింగ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రోజుకు 50 మంది చొప్పున నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆ మేరకు ఈ నెల 14, 16, 17వ తేదీల్లో మొత్తం ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ద్వారా నియామకాలు చేపడతామని అన్నారు. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ భక్తవత్సలం, సూపరింటెండెంట్‌ గోపాల్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్స్‌ అతావుల్లా, బత్తనయ్య, రవికుమార్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Cognizant New Campus: కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన

#Tags