Employees Protest : మౌన దీక్షలో ఉద్యోగులు.. కారణం ఇదే..!
సాక్షి ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన ఈ నిరసనలో భాగంగా, దీక్షా శిబిరం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. వరుసగా కొన్ని సంవత్సరాల నుంచి శ్రమ దోపిడీకి గురవుతున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం ర్యాలీ చేశారు. వారికి భద్రత కల్పించాలని ఈ మెరకు డిమాండ్ చేశారు ఉద్యోగులు.
Pilot After Inter: పైలట్ కొలువుకు.. సై అంటారా!.. ఇంటర్మీడియెట్ అర్హతతోనే పైలట్ అవకాశం
నోటికి గుడ్డలు..
సమ్మేలో భాగంగా ర్యాలీ నిర్వహించడమే కాకుండా, ఏకంగా అందరూ మౌన దీక్ష పాటించారు. ప్రతీ ఉద్యోగి వారి నోటిలో గుడ్డలు కట్టుకున్నారు. దీంతో, వారికి అధికారులు స్పందించి, న్యాయం జరిగే వరకు ఈ నిరసనను కొనసాగిస్తామన్నారు.
Employees Demand : సమగ్ర శిక్ష ఉద్యోగుల వినతిపత్రం.. డిమాండ్లు ఇవే!
ఊసే లేదు..
డీఈవో కార్యాలయ సిబ్బంది ఉద్యోగులను భయాభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా తమ సమస్యల పరిషారంపై ఊసే లేదన్నారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గణేశ్ మద్దతు ప్రకటన చేశారు. ఎస్‌ఎస్‌ఏ నాయకులు, వినోద్, ప్రకాశ్, కేశవ్, పార్థసారథి, వెంకటి, శ్రీకాంత్, రాజన్న, సురేశ్, భీజన్న, దీప్తి, మల్లిక, ప్రియాంక, దశరథ, సలీం, సందీప్, సురేందర్ పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)