TCC Exam: 22 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

కడప ఎడ్యుకేషన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీటీసీ)లైన డ్రాయింగ్‌, హ్యండ్లూమ్‌, వివింగ్‌,ౖటైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలను ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు నోటిఫైడ్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్లలో నిర్వహించనున్నట్లు డీఈఓ మర్రెడ్డి అనూరాధ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను www.bsc.ap.gov.in లో పొందుపరిచినట్లు తెలిపారు. టీటీసీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌లతోపాటు ప్రభుత్వం జారీ చేయబడిన ఏదైనా ఒక ఒరిజినల్‌ ఫొటో ఐడీ కార్డు తీసుకుని రావాలని తెలిపారు.

చదవండి: DEO Mareddy Anuradha: విద్యార్థుల సామర్థ్యాల అంచనా కోసమే శ్లాస్‌ పరీక్ష

21న ఏపీ మోడల్‌ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లె ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఆరోతరగతి ప్రవేశం కోసం ఈనెల 21వ తేదీ ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ కోమటిరెడ్డి శివశంకర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లు పొంది పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని చెప్పారు. 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి హాల్‌ టికెట్‌తో పరీక్ష కేంద్రంలోకి రావాలని సూచించారు.

#Tags