Degree Results: డిగ్రీ సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఉత్తీర్ణులైన విద్యార్థులు..!

ఏయూ డిగ్రీ విద్యార్థుల ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల చేశారు..

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్‌ ఆచార్య డి.వి.ఆర్‌.మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవగా 27,483 మంది ఉత్తీర్ణత సాధించారు.

Kitchen Gardens: పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్స్‌ ఏర్పాటు.. విద్యార్థుల‌కు అవ‌గాహ‌న స‌ద‌స్సు..!

దీంతో 99.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీఏ(సీబీసీఎస్‌)లో 99.68, బీబీఏ(సీబీసీఎస్‌)లో 98.66, బీకాం(కంప్యూటర్స్‌)లో 99.71, బీకాం(జనరల్‌)లో 99.92, బీహెచ్‌ఎంసీటీలో 100, బీఎస్సీలో 99.52, బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీలో 90, బీఎస్సీ ఫుడ్‌ సైన్స్‌లో 100, బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీలో 100, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషన్‌లో 100 మంది ఉత్తీర్ణత సాధించారు.

D.Pharmacy: డీ–ఫార్మసీతో ఉపాధికి భరోసా.. రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. దరఖాస్తు చేసుకోండి

#Tags