SPARC: విద్యార్థుల సాంకేతిక విద్య‌కు 'స్పార్క్' తోడ్పాటు

విద్యార్థులు సాంకేతిక విద్య‌ను నేర్చుకోవ‌డానికి సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్ (స్పార్క్) వ్య‌వ‌స్థ తోడ్పాటునందిస్తోంది.

నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం మిట్టపల్లిలోని ఆక్సిలియం విద్యానికేతన్‌లో స్పార్క్ గ్రామీణ శాస్త్రీయ ఇంక్యుబేటర్ (టెక్నోఉత్సవ్‌) కేంద్రంను ప్రారంభించారు. స్పార్క్ ఫౌండేషన్ ఎంఓయు ప్రకారం స్పార్క్ శాస్త్రీయ ఇంక్యుబేటర్ సెంటర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా సెంటర్‌లో విద్యార్థులు సాదారాణ విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా నేర్చుకోనున్నారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్ (స్పార్క్) చైర్మన్, ఐబిఆర్, టీబీఆర్ హోల్డ‌ర్‌ ఎస్ సాయి సందీప్‌ తెలిపారు. స్పార్క్ సంస్థ అందించే ఈ సువర్ణావకాశాన్ని ప్రతి విద్యార్థి స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా అగ్నిమాప‌క అధికారి అవినాష్ జై సింహ అన్నారు. వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, సృష్టించడానికి రోబోటిక్స్, ఖగోళ శాస్త్ర వర్క్‌షాప్‌లను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి గ్రామీణ శాస్త్రీయ ఇంక్యుబేటర్ మిషన్‌ను పరిచయం చేస్తున్నామని సాయి ప్రదీప్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించ‌డ‌మేన‌ని ఆయ‌న అన్నారు. 


ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఔట్రీచ్ మరియు శాస్త్రీయ విద్యను తెలుసుకోవడానికి సహాయపడుతుంది, దీనితో విద్యార్థులందరూ పూర్వ ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి అన్ని శాస్త్రీయ ఆలోచనలను తెలుసుకుంటార‌ని మండల విద్యాధికారి స్వరూప రాణి అన్నారు. అలాగే సంస్థ సభ్యులు రీసైకిల్ మెటీరియల్‌తో వివిధ వస్తువులు తయారీ వాటి వినియోగం విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు. రాడార్ నావిగేషన్ సిస్టం, టెలిస్కోప్ ప్రదర్శన, మార్స్ రోవర్ యంత్రం, సెన్సార్ డ్రోన్, రాకెట్ మోడల్‌ను ప్రదర్శించారు. అలాగే విద్యార్థులకు టెలిస్కోప్ ద్వారా అంతరిక్ష వీక్షణ కల్పించారు.  

 

#Tags