Skip to main content

District Additional Collector: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం అలవర్చాలి

scientific attitude should be inculcated in the students

బెల్లంపల్లి: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం అలవర్చేలా ఉపాధ్యాయులు బోధన చేసి సమాజ మార్పుకు దోహాదపడాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌ అన్నారు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్‌ కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జోనల్‌ స్థాయి సైన్స్‌ఫేర్‌ బుధవారం అట్టహాసంగా ముగిసింది. ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌కు ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌ మాట్లాడుతూ తరగతి గదులు విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతాయని అన్నారు. అంధ విశ్వాసాలను సమాజం దూరం పెట్టినప్పుడే మెరుగైన సమాజం ఆవిష్కృతమవుతుందని తెలిపారు. అందుకోసం నేటి విద్యార్థులకు శాసీ్త్రయ బోధనలు అవసరమని అన్నారు. విద్యార్థులు ప్రతీ విషయాన్ని ఎందుకు అని తనకు తాను ప్రశ్నించుకుంటూ రోజుకో కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. అనంతరం ప్రదర్శలను తిలకించి ఒక్కో ప్రదర్శనపై విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ అవగాహనను పరిశీలించారు. మొత్తం 116 ప్రదర్శనలు రాగా అంశాల వారీగా విద్యార్థులు ఎలా తయారు చేశారో గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని అదనపు కలెక్టర్‌ ప్రశంసించారు.

రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు
జోనల్‌స్థాయిలో ఉత్తమంగా నిలిచిన ఆరు ప్రదర్శల ను రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌కు ఎంపిక చేశారు. అంశా ల వారీగా ప్రదర్శలను ఎంపిక చేసిన ప్రథమ, ద్వి తీయ, తృతీయ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ప్రథమ శ్రేణిలోని వి ద్యార్థుల ప్రదర్శలను రాష్ట్ర స్థాయికి పంపించనున్న ట్లు ప్రకటించారు. వీరిలో కె.అక్షిత్‌, డి.మనీష్‌(సంక్షేమ బాలుర గురుకుల కళాశాల, కాసిపేట), ఐ.తే జ, సాయిరాం(సీఈఓ బాలుర గురుకుల విద్యాల యం, బెల్లంపల్లి), ఎం.అక్షయ, టి.గంగభవానీ(స ంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, నిజామాబా ద్‌), జె.అంజన్న, జి.డేవిడ్‌(సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ఏటూరు నాగారం), ఏ.శివచరణ్‌, ఎం.సాయికిరణ్‌(సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ఆర్మూర్‌), వి.సుందర్‌, బి.శివచరణ్‌(సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, మంచిర్యాల) ఉన్నా రు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌ జిల్లాల కో ఆర్డినేటర్లు ఎస్‌.శ్రీనివాస్‌, పి.బాలరాజు, బెల్లంపల్లి బాలిక ల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.స్వరూప, వై స్‌ ప్రిన్సిపాల్‌ పి.స్వరూప, బెల్లంపల్లి సీఈఓ బాలు ర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు, రీజియన్‌ పరిధిలోని సంక్షేమ గురుకులాల ప్రిన్సి పాల్స్‌ ప్రేమరాణి, జ్యోతి, రమేష్‌బాబు, సంతోష్‌, శ్రీనాథ్‌, సంగీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 03:29PM

Photo Stories