Skip to main content

MACS G20: మాక్‌ జీ–20 సదస్సుకు విదేశీ ప్రతినిధులుగా ఎంపికై న విద్యార్థులు వీరే..

Macs G20 conference, kakinada,

మాక్‌ జీ–20 సదస్సుకు విదేశీ ప్రతినిధులుగా ఎంపికై న విద్యార్థులు వీరే..

విద్యార్థి పేరు హైస్కూలు ప్రాతినిధ్యం వహించే దేశం
1. జి.దుర్గరాజు నాగులాపల్లి యూఎస్‌ఏ
2. హనీ పి.వెంకటాపురం ఆస్ట్రేలియా
3. లాస్య పి.తిమ్మాపురం రష్యా
4. లక్ష్మీప్రసన్న శంఖవరం యూకే
5. దివ్య పి.దొంతమూరు జపాన్‌
6. భానుశ్రీ పి.దొంతమూరు ఇటలీ
7. లక్ష్మీ ప్రసన్న ఏకేపీఎం హైస్కూలు,పిఠాపురం జర్మనీ
8. విజయ పి.దొంతమూరు ఇండియా
9. లలితా భువనశ్రీ వేలంక టర్కీ
10. లాస్య మల్లేపల్లి అర్జంటీనా
11. గనన్య ఎన్‌.సూరవరం బ్రెజిల్‌
12. భవనశ్రీ పి.వెంకటాపురం దక్షిణాఫ్రికా
13. తేజ వెంకట శ్రీసాయి రాజపూడి ఆఫ్రికా
14. మదర్‌ థెరీసా తుని ఇండోనేషియా
15. మధుప్రియ నాగులాపల్లి చైనా
16. లక్ష్మణ్‌ తాళ్లూరు సౌదీ అరేబియా
17. అపర్ణ వన్నెపూడి ఫ్రాన్స్‌
18. చిన్నారి తామరాడ కెనడా
19. ఇందువర్షిణి మల్లేపల్లి ఈయూ
20. జెరుషా మాధవపట్నం మెక్సికో


పిఠాపురం: నిన్నమొన్నటి వరకూ ఇంగ్లిషు మాట్లాడటమంటేనే వారికి తెలీదు. పైగా అమ్మ ఒడిలో ఉన్నప్పటి నుంచీ వినని భాష కావడంతో తెలియని బెరుకు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకు వచ్చిన సంస్కరణలతో మన విద్యార్థుల్లో ఆ బెరుకు, వెనుకబాటుతనం పూర్తిగా మాయమయ్యాయి. ఇప్పటికే బెండపూడి విద్యార్థులు అమెరికన్‌ యాక్సెంట్‌లో ఆంగ్ల సంభాషణలతో అదరగొట్టి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసలు కూడా అందుకున్నారు. మరికొంతమంది ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి, శభాష్‌ అనిపించుకున్నారు. దీనికి కొనసాగింపుగా కాకినాడ జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఇప్పుడు మరో మెట్టు పైకెక్కారు. ఇంగ్లిషులో చకచకా మాట్లాడటమే కాదు.. వివిధ దేశాల శైలిలో అనర్గళంగా ప్రసంగించే స్థాయికి చేరుకున్నారు. మన తెలుగు భాషకే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉచ్చారణ శైలి ఉంది. అదేవిధంగా ఆంగ్ల భాషను కూడా ఒక్కో దేశంలో ఒక్కో శైలిలో మాట్లాడుతూంటారు. దీనిని మన విద్యార్థులు ఒడిసిపట్టారు. దేశమేదైనా.. భాష ఏదైనా.. తగ్గేదే లే.. అంటున్నారు. త్వరలో కాకినాడ జిల్లా స్థాయిలో జరిగే మాక్‌ జీ–20 సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులుగా పాల్గొనేందుకు పలు పాఠశాలల నుంచి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తద్వారా పేద విద్యార్థులు సైతం ఇంగ్లిషు చదువుల్లో రాణించాలనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాన్ని వారు మరోసారి నిజం చేయనున్నారు. కలెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి, యూనివర్సిటీ ఇంగ్లిషు ప్రొఫెసర్ల సమక్షంలో కలెక్టరేట్‌లో త్వరలోనే ఈ సదస్సు జరగనుంది.

రైజ్‌తో ఆంగ్ల విద్యోదయం
ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్‌ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో కలెక్టర్‌ కృతికా శుక్లా రెడీనెస్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ సిచ్యువేషనల్‌ ఇంగ్లిష్‌ (రైజ్‌) కార్యక్రమం రూపొందించారు. ఒక విద్యార్థి రోజువారీ కార్యక్రమాల్లో ఏ విషయమైన మొత్తం ఇంగ్లిషులోనే చెప్పగలిగేలా తీర్చిదిద్దే లక్ష్యంతో రైజ్‌ కార్యక్రమం అమలు చేస్తున్నారు. దీని ద్వారా తుని నియోజకవర్గంలోని 34 ఉన్నత పాఠశాలల్లో సుమారు 1,500 మంది విద్యార్థులు ఇంగ్లిషులో నిష్ణాతుల్ని చేశారు. ఇది విజయవంతమైంది. అనంతరం కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఆనంద నిలయం బాలుర వసతి గృహంతో కలిపి మొత్తం 47 హైస్కూళ్లు, 50 ప్రాథమిక పాఠశాలలు, పిఠాపురం నియోజకవర్గంలోని 50 ప్రాథమిక, 12 ప్రాథమికోన్నత, 32 ఉన్నత పాఠశాలల్లో కూడా రైజ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఈ విద్యా సంవత్సరం జగ్గంపేట నియోజకవర్గంలోని దీనిని ప్రారంభించారు. దీని కోసం నియోజకవర్గంలోని 75 మంది హైస్కూలు ఆంగ్ల ఉపాధ్యాయులకు, 90 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ‘బెండపూడి సార్‌’గా పేరొంది, ప్రస్తుతం పి.దొంతమూరు జెడ్పీ హైస్కూలులో ఇంగ్లిష్‌ టీచర్‌గా పని చేస్తున్న గంటా ప్రసాద్‌ కో ఆర్డినేటర్‌గా, 12 మంది ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ నిపుణులతో కలిసి, రైజ్‌ మాడ్యూల్‌ రూపొందించారు. పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం అమలవుతోంది.


ఆంగ్లం.. వారికి కరతలామలకం అనర్గళంగా మాట్లాడేస్తున్న మన కుర్రాళ్లు త్వరలో మాక్‌ జీ–20 సదస్సులో సత్తా చూపనున్న విద్యార్థులు అభివృద్ధి చెందిన దేశాలున్న కూటమి పాల్గొన్న జీ–20 సదస్సును కేవలం తెలుగు తప్ప ఏ భాషా సక్రమంగా రాని సాధారణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించడం గొప్ప విజయంగా చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే విద్యార్థులు ఆయా దేశాల ఉచ్చారణ శైలిని అనుకరించి, అనర్గళంగా మాట్లాడటం పెద్దపెద్ద ప్రొఫె సర్లనే ఆశ్చర్యానికి గురి చేసింది. నియోజకవర్గ స్థాయిలో మాక్‌ జీ–20 సదస్సు విజ యవంతంగా నిర్వహించాం. ప్రపంచ వ్యాప్తంగా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ద్వారా డిజిటల్‌ టచ్‌ స్క్రీన్‌పై పాఠాలు చెప్పే 3,800 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రైవేటు పాఠశాలలకు మించిన ప్రతిభతో మన విద్యార్థులు దూసుకుపోతున్నారు.
– జీవీ ప్రసాద్‌, కో ఆర్డినేటర్‌, రైజ్‌, కాకినాడ జిల్లా

Published date : 19 Oct 2023 11:32AM

Photo Stories