School Annual Day: ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ వేడుక
Sakshi Education
శుక్రవారం జరిగిన వార్షికోత్సవంలో పాఠశాలలోని విద్యార్థులంతా పాల్గొన్నారు. వేడుకలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు..

కెలమంగలం: డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని జవుళగిరిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖన, ఉపన్యాస పోటీలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
CUET (PG) 2024: క్యూట్ పీజీసెట్‌కు 4.62 లక్షల మంది హాజరు.. ఈసారి దేశం వెలుపల పరీక్షలు
ఈ సందర్భంగా చిన్నారుల కార్యక్రమాలు అలరింపజేశాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్రేష్, సావిత్రమ్మ, శాంతమ్మ, జ్యోతి, పీటీఏ, ఎస్‌ఎంసి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Published date : 30 Mar 2024 01:45PM