Career: కెరీర్ డెవలప్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు
తిరుపతి సిటీ: ఎస్వీయూ మహిళా అధ్యయన, విస్తరణ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక శ్రీగోవిందరజస్వామి ఆర్ట్స్ కళాశాలలో కెరీర్ డెవలప్‌మెంట్‌పై విద్యార్థులకు నవంబర్ 16 గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ, మహిళా వర్సిటీ అధ్యాపకులు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు, ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ వెబ్‌సైట్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సదస్సులో ఆచార్య కె.సుధారాణి, డాక్టర్ జగదీశ్వరి, మహిళా వర్సిటీ పీఆర్‌ఓ డాక్టర్ రజినీ, ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ టి.శ్రీనివాసులు, కామర్స్ విభాగాధిపతి ఉమామహేశ్వరి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు హజరయ్యారు.
చదవండి: 3,220 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ప్రిపరేషన్ ఇలా
Tags
- Career
- Career Development
- awareness
- Career Development Awareness
- Students
- Skills
- Career of Students
- Private Sector
- SVU University
- job opportunities
- Free Skill Development Courses
- Jobs
- Jobs in Andhra Pradesh
- Education News
- andhra pradesh news
- SVUWomensStudies
- Sri Govindarajaswamy Arts College
- Thursday
- November 16
- Sakshi Education Latest News