Skip to main content

Perni Nani: అమ్మఒడి పథకానికి ఈ అర్హ‌త‌లు తప్పనిసరి..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో అక్టోబ‌ర్ 28వ తేదీన‌(గురువారం) ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Minister Perni Nani
Minister Perni Nani

ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమపథకాలు అందిస్తాం అని తెలిపారు. 

కేబినెట్‌లో భేటీలో ఆమోదించిన పలు అంశాలు..
►అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న వారందరికీ జూన్‌, డిసెంబర్‌లో అర్జీకి అవకాశం కల్పిస్తాం. 
►వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఆమోదం
►కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అంగీకారం.
►560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదం.
►వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
►ఇప్పటి వరకు మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
►వైద్య ఆరోగ్యశాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేశాం. 
►అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం.
►ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.

Published date : 28 Oct 2021 04:43PM

Photo Stories