Amendment of Rule 22 and 22A issued- ఉద్యోగాల భర్తీలో కీలక మార్పులు,మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇకపై అలా ఉండబోదు
కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు.దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది.
పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు
తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు.
తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి
ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్‌పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు.దీంతో ఏదైనా నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయడం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు.
మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా పరిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది.
Tags
- ts government
- Telangana State Government
- TS government jobs
- amendments
- New Rules
- Government Jobs
- Horizontal Reservation
- 33 percent horizontal reservation for women in recruitment
- TS Govt implements 33 percent horizontal reservation for women in recruitment
- 33 percent horizontal reservation for women in recruitment news in telugu
- Special reservations to be treated horizontally Telangana HC