Skip to main content

Twin Brothers Got Same Marks in 10th and Inter : ప‌రీక్ష‌ల్లో విచిత్రాలు ఎన్నో.. ఈ కవలల‌కు టెన్త్‌, ఇంట‌ర్‌లోనూ..

ఈ మ‌ధ్య‌కాలంలో కవలలు ప‌రీక్ష‌ల్లో ఎన్నో విచిత్రాలు చేస్తున్నారు. అలాగే ప‌రీక్ష‌ల్లో కూడా విచిత్రం ఒకే మార్కులు కూడా సాధింస్తున్నారు.
Twin brothers Ram and Lakshman   Telangana Inter results with top ranks

ఇటీవ‌లే కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్‌ చుక్కి, ఇబ్బని. వీరు ఒకే పోలికలతో ఉంటారు. అంతేకాదు పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ కవలల మార్కుల మధ్య తేడా కూడా..
ఇలాగే తెలంగాణ‌కు చెందిన రామ్, లక్ష్మణ్ లు కూడా కవలలు. తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాలలో వీరు బెస్ట్ ర్యాంక్స్ సాధించారు. కానీ వీరిద్దరికి వచ్చిన మార్కుల తేడా ఎంతో తెలుసా..? ఈ కవలల మార్కుల మధ్య తేడా కూడా రెండంటే రెండు. ఒకరికి 983 మార్కులు రాగా, మరొకరికి 981 మార్కులు వచ్చాయి. బెస్ట్ మార్కులు సాధించి తల్లిదండ్రులు, లెక్చరర్ల చేత అభినందనలు పొందుతున్నారు.

☛ Twin Sisters Got Same Marks in 10th and Inter : విచిత్రం అంటే ఇదే ఏమో.. ఈ కవల అక్కాచెల్లెళ్లు.. ఇంట‌ర్‌లో 620/625 ఒకే మార్కులు.. టెన్త్‌లో కూడా..

కుటుంబ నేప‌థ్యం :
తెలంగాణ‌లోని నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతులకు కవలలు జన్మించారు. అయితే ఒకే రూపంతో పుట్టిన తమ బిడ్డలకు ఈ తల్లిదండ్రులు రామ్, లక్ష్మణ్ అనే పేరు పెట్టారు. దేవుళ్ళ నామాలతో నామకరణం పొందిన ఈ ఇద్దరు, బాల్యం నుంచే చదువులో రాణిస్తూ.. ఉపాధ్యాయుల చేత తమదైన శైలిలో ప్రశంసలు పొందారు. తమ తల్లిదండ్రులు, లెక్చరర్లు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. తాము భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా స్థిరపడాలని లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.

☛ Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

ఎడ్యుకేష‌న్ : 
రామ్, లక్ష్మణ్.. ఆత్మకూరు ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చ‌దివారు. ఇటీవ‌లే సెకండియర్ పూర్తి చేసుకున్న వీరు ఎంపీసీలో ఉత్తమ ర్యాంకు సాధించారు.  ఇష్టపడి చదివితే సాధించనిది ఏదీ లేదంటూ నిరూపించారు ఈ కవలలు. ఈ కవలలు టెన్త్‌లో కూడా ఒకే విధంగా..10 కి 10 గ్రేడ్ సాధించారు.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

Published date : 29 Apr 2024 04:24PM

Photo Stories