Skip to main content

Inter Paper Valuation: నేటి నుంచి ఇంటర్‌ పేపర్‌ వాల్యూవేషన్‌ ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జవాబు పత్రాల పేపర్‌ వాల్యూవేషన్‌ ప్రారంభం కానున్నట్లు డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ts Inter paper valuation starts from today

ఉమ్మడి జిల్లాలోని ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి వాల్యూవేషన్‌ మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్‌ కళాశాలలో చేపడుతున్నామన్నారు. వాల్యూవేషన్‌కు ఆర్డర్‌ తీసుకున్న అధ్యాపకులు వాల్యూవేషన్‌కు హాజరుకావాలాని, బోర్డు ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రశ్నపత్రాలకు కోడింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. మొత్తం 4 లక్షల పేపర్లు వాల్యూవేషన్‌ చేయనున్నామని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

చదవండి: Inter & 10th Class Model Papers: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.. మోడల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసుకోండిలా

Published date : 04 Mar 2024 06:44PM

Photo Stories