Skip to main content

TS Inter Results 2024: నేడు తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తోనే చూసుకోండి ఇలా!

ఇంటర్‌ రెండు సంవత్సరాల ఫలితాలను నేడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేయనున్నారు. విద్యార్థులంతా తమ ఫలితాలను ఈ విధంగా చూసుకోవచ్చు..
Telangana Intermediate Results 2024 releases today  Inter exam results  one click access  Easy result checking software

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు నేడు (బుధవారం) ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా కార్యక్రమంలో పాల్గొంటారు.

TS Inter Results 2024 Live Updates: నేడే 11 గంటలకు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో,రిజల్ట్స్‌ ఇలా చూడొచ్చు..

ఇక తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను అందరికన్నా త్వరగా అందించేందుకు ‘సాక్షి’ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకే క్లిక్‌తో తేలికగా ఫలితాలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది. www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి వేగంగా ఫలితాలు చెక్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

Published date : 24 Apr 2024 10:54AM

Photo Stories