Skip to main content

M Sridhar: పరీక్షల్లో ఫెయిలైతే మనోధైర్యం కోల్పోవద్దు

ఆదిలాబాద్‌ టౌన్‌: విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే మనోధైర్యం కోల్పోయి ఎలాంటి అఘయిత్యాలకు పాల్పడకుండా ధైర్య ంగా ఉండాలని జిల్లా ఎన్‌సీడీ ప్రాజెక్ట్‌ అధి కారి ఎం.శ్రీధర్‌ అన్నారు.
Dont lose heart if you fail in exams

ఇంటర్మీడియెట్‌ ఫలితాలు మరో రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో ఏప్రిల్ 22న‌ ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవచ్చని, దాన్ని చాలెంజ్‌గా తీసుకొని మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలే తప్ప నిరాశ చెంది ఆత్మహత్యకు యత్నించవద్దని పేర్కొన్నారు.

చదవండి: Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు..

ఒకసారి పరీక్ష తప్పినంత మాత్రన బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంతోమంది ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన వారు మళ్లీ సప్లిమెంటరీలో పాస్‌ అయి వైద్యులుగా, ఇంజినీర్లుగా,ఉన్నతాధికారులుగా అయ్యారని గుర్తు చేశారు.

Published date : 23 Apr 2024 03:20PM

Photo Stories