Skip to main content

Civil Judge Posts: తెలంగాణలో సివిల్‌ జడ్జి పోస్టులకు దరఖాస్తులు..

తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పరిధిలోని జూనియర్‌ విభాగంలో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for Civil Judge Posts in Telangana High Court

»    మొత్తం పోస్టుల సంఖ్య: 150
»    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్ల పాటు అడ్వకేట్‌ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్‌ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడిషియల్‌ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
»    వయసు: అభ్యర్థులు కనిష్టంగా 23 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు వయసు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
»    వేతనం: నెలకు రూ. 77,840 నుంచి రూ.1,36,520.
»    ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), రాతపరీక్ష, వైవా–వాయిస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    స్క్రీనింగ్‌ టెస్ట్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంగనగర్, ఖమ్మం.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.05.2024
»    స్క్రీనింగ్‌ టెస్ట్‌ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: 08.06.2024.
»    స్క్రీనింగ్‌ పరీక్ష తేది(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష): 16.06.2024.
»    వెబ్‌సైట్‌: https://tshc.gov.in/ 

Upgradable ATMs: భారత్‌తో తొలిసారి కొత్త రకం ఏటీఎంలు.. సీఆర్‌ఎం మెషీన్లు అంటే ఏమిటీ?

Published date : 30 Apr 2024 10:50AM

Photo Stories