Skip to main content

Telangana TRT & DSC 2024 Notification: 11,062 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గత ఏడాది డీఎస్సీకి దరఖాస్తు చేసినవారు మళ్లీ చేయనవసరం లేదు
Teacher Vacancies in Government Schools   Application Process   Telangana State School Education Department   Telangana Teacher Recruitment Notice   Telangana TRT and DSC 2024 Notification  Job Opportunities in Telangana Schools

మొత్తం పోస్టుల సంఖ్య: 11,062.
పోస్టుల వివరాలు: స్కూల్‌ అసిస్టెంట్‌లు(ఎస్‌ఏ)–2,629,ఎస్‌జీటీ–6,508,ఎల్‌పీ–727,పీఈటీ–182, ఎస్‌ఏ(స్పెషల్‌)–220,ఎస్జీటీ(స్పెషల్‌)–796.

అర్హతలు
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) పోస్టులకు డీఎడ్‌ పూర్తిచేసిన వారే అర్హులు. బీఈడీ వారు అర్హులు కాదు. స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) పోస్టులకు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. నాలుగేళ్లు బీఈడీ పూర్తిచేసిన వారు కూడా అర్హులే. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసిన వారు బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ, డీఎడ్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ, ఏపీ టెట్‌ లేదా సెంట్రల్‌ టెట్‌(సీటెట్‌)లో క్వాలిఫై అయి ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 46 ఏళ్లలోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష(టీఆర్‌టీ)కు 80శాతం, టెట్‌లో పొందిన మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 02.04.2024.
పరీక్ష తేదీలు: త్వరలో ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in/

చదవండి: TS DSC and TET Candidates Demands : తెలంగాణ డీఎస్సీ, టెట్ అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే.. ఈ నిబంధనలు తొల‌గించాల్సిందే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 11 Mar 2024 05:30PM

Photo Stories