UPSC highest scores: సివిల్స్‌లో సబ్జెక్ట్‌ల వారీగా టాప్ స్కోరర్లు వీరే... ఏ ఒక్క సబ్జెక్ట్‌లోనూ టాప్‌లో లేని టాప్ ర్యాంకర్ ఇషితా
ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష ఇది. 2022లో నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫలితాలు గత మే నెలలో విడుదలయ్యాయి. ఇప్పటికే ర్యాంకులు కూడా వెళ్లడయ్యాయి.
అయితే తాజాగా ఒక్కో సబ్జెక్ట్‌లో ఎవరు టాప్ మార్కులు సాధించారు అన్న విషయం వైరల్‌గా మారింది. సివిల్స్ 2022 ఫలితాల్లో టాప్ 1 ర్యాంకర్ అయిన ఇషితా ఏ ఒక్క సబ్జెక్ట్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలవకపోవడం గమనార్హం.
IAS Anju Sharma Success Story: పది, ఇంటర్‌లో ఫెయిలయ్యా... ఈ అపజయాలే నన్ను 22 ఏళ్లకే ఐఏఎస్‌ను చేశాయ్... అంజు శర్మ సక్సెస్ స్టోరీ
సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లుంటాయి. ఇందులో ఒక్కో అభ్యర్థి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చు. మిగిలిన ఐదు పేపర్లు అందరకీ కామన్‌గా ఉంటాయి. ఎస్సే, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 ఇలా ఉంటాయి. అయితే ఈ ఐదు పేపర్లలో టాప్ ర్యాంకర్ ఇషితా కిషోర్ ఏ ఒక్క సబ్జెక్ట్‌లోనూ టాపర్‌గా నిలవలేకపోయింది.
సబ్జెక్ట్‌ల వారీగా టాపర్ల వివరాలు ఇలా ఉన్నాయి....
ఎస్సేలో.... ఎస్సే రైటింగ్‌లో ఆల్ ఇండియా 61వ ర్యాంకు సాధించిన గౌతమ్ వివేకానందన్ టాప్‌లో నిలిచారు. ఈయన 149 మార్కులు సాధించారు.
జనరల్ స్టడీస్ 1లో ఆల్ ఇండియా 110వ ర్యాంకు సాధించిన అభిషేక్ దవాచ్చా నిలిచారు. ఈయన 128 మార్కులతో టాప్‌లో నిలిచాడు.
జనరల్ స్టడీస్ 2లో ఆల్ ఇండియా 23వ ర్యాంకు సాధించిన వైశాలి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఈమెకు మొత్తం 125 మార్కులు వచ్చాయి.
UPSC topper Ishita Kishore’s marks: అదరగొట్టిన యూపీఎస్సీ టాపర్ ఇషితా కిషోర్... ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నంటే...
జనరల్ స్టడీస్ 3లో ఆల్ ఇండియా 105వ ర్యాంకు సాధించిన మయూర్ హజారికా నిలిచారు. మొత్తం 102 మార్కులు సాధించి ఈ సబ్జెక్ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిగా నిలిచారు.
జనరల్ స్టడీస్ 4 ఎథిక్స్‌లో ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించిన గరిమా లోహియా నిలిచారు. ఈ సబ్జెక్ట్‌లో 141 మార్కులు సాధించి ఆమె అత్యధిక స్కోర్ చేసిన అభ్యర్థిగా నిలిచారు.