Skip to main content

Good news to IT Employees: ఐటీ ఉద్యోగం ​కోసం చూస్తున్నారా... అయితే ఈ న్యూస్ మీ కోస‌మే..!

ఎటు చూసినా ఉద్యోగాల కోతతో ఆందోళలో ఉన్న ఐటీ ఉద్యోగులకు, ఉద్యోగాలు వస్తాయో రావో అంటూ భయం భయంగా ఉన్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు అమెరికా సంస్థ తీపి కబురు అందించింది.
ఐటీ ఉద్యోగం ​కోసం చూస్తున్నారా...
ఐటీ ఉద్యోగం ​కోసం చూస్తున్నారా...

మెటా, ట్విటర్‌,  అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి టెక్‌దిగ్గజ సంస్థలు ఖర్చలు తగ్గింపుపేరుతో వేలాది మందిని తొలగిస్తున్న తరుణంలో ఐటీ కంపెనీ ఆక్స్ట్రియా (Axtria Inc) శుభవార్త  చెప్పింది.

Layoffs Crisis: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆందోళ‌న వ‌ద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ

software jobs

డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ , డేటా ఇంజినీరింగ్ రంగాలలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు, నోయిడాలో ఇప్పటికే ఉన్న ఆఫీసులతో పాటు పూణే  హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కార్యాలయాల్లో కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.  

IT Crisis: హాఫ్‌ జీతానికే ప‌నిచేయండి... లేదంటే.. ప్రెష‌ర్స్‌కు ఐటీ కంపెనీ భారీ షాక్‌

software jobs

రాబోయే 8-10 నెలల్లో 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, డేటా ఇంజనీర్‌లతో ఈ అవకాశాలను సృష్టించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో డేటా సైన్స్ లో చాలా మార్పు వస్తుందని  పీపుల్ ప్రాక్టీసెస్ హెడ్ శిఖా సింఘాల్  భావిస్తున్నారు.

software jobs

IT Crisis: మీరు మాత్రం ఇలా చేస్తే రోడ్డున ప‌డ‌తారు.. కారు, ఇళ్లు అమ్ముకుని వెళితే... టెకీకి దిమ్మ‌తిరిగే షాక్‌

అంతేకాదు రానున్న రెండేళ్లలో ఇంటెన్సివ్ క్యాంపస్ నియామకానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే 2023కి సంబంధించి అగ్రశ్రేణి  ఐఐటీ ప్లేస్‌మెంట్ కార్యాలయాలతో పాటు ఇతర ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తాజా నివేదికల సమాచారం. ప్రస్తుతం ఈ కంపెనీలో  దేశవ్యాప్తంగా 3 వేల మంది పని చేస్తున్నారు.

Published date : 19 Jun 2023 05:13PM

Photo Stories