Skip to main content

Agniveer Vayu Notification: అగ్నివీర్‌ వాయు నియామకాల నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల వివ‌రాలు ఇలా..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా.. అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది..
Agniveer Vayu Recruitment notification released with the details of posts

సాక్షి ఎడ్యుకేష‌న్‌: అగ్నివీర్‌ వాయు (మ్యూజీషియన్‌) (01/2025) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
»    అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల/బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌/పదో తరగతి లే దా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు సంగీతంతోపాటు సంబంధిత వాయిద్య పరికరం వాయించడంతో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సంగీతానుభవ ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలి. నిర్దిష్ట  శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
»    వయసు: 02.01.2004 నుంచి 02.07.2007 మధ్య జన్మించి ఉండాలి.
»    ఎంపిక విధానం: మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్, ఇంగ్లిష్‌ రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 22.05.2024.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: 05.06.2024.
»    రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ తేదీలు: 03.07.2024 నుంచి 12.07.2024 వరకు
»    వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in

Agniveer Recruitment: ఇండియన్‌ నేవీలో అగ్నివీర్‌ పోస్టులు

Published date : 15 May 2024 01:51PM

Photo Stories