Skip to main content

workplace flexibility: టెకీల‌కు గుడ్‌న్యూస్‌.. మ‌రికొన్నేళ్ల‌పాటు హైబ్రిడ్ వ‌ర్క్ మోడ‌ల్‌కే సాఫ్ట్‌వేర్ కంపెనీల మొగ్గు..!

కరోనా వైరస్ విజృంచిన సమయంలో ఉద్యోగులంతా దాదాపు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home)కి పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితి వచ్చింది. కానీ ఆఫీసులకు రావడానికి ఎంప్లాయిస్ ససేమిరా అంటున్నారు.
WFH to Office Transition,,Hybrid model of work, Employee Flexibility Needs ,Shifting Work Dynamics
టెకీల‌కు గుడ్‌న్యూస్‌.. మ‌రికొన్నేళ్ల‌పాటు హైబ్రిడ్ వ‌ర్క్ మోడ‌ల్‌కే సాఫ్ట్‌వేర్ కంపెనీల మొగ్గు..!

సంస్థలేమో ఆఫీసులకు రమ్మంటుంటే.. ఉద్యోగులేమో ఇంటి నుంచి పనిచేస్తామని పట్టుపడుతున్నారు. ఈ సమస్యకు హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రస్తుతం దిగ్గజ కంపెనీలు సైతం తప్పకుండా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని, ఈ నిర్ణయం కాదంటే ఉద్యోగానికి రాజీనామా చేయొచ్చని తేల్చి చెబుతున్నాయి. కానీ ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. దీనికోసం హైబ్రిడ్ వర్క్ కొనసాగించాలని భావిస్తున్నారు. ఇది తప్పకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు.

చ‌ద‌వండి: ఏఐతో క్ల‌రిక‌ల్ ఉద్యోగుల‌కు నిద్ర‌లేని రాత్రులే..!

IT Employees

వివిధ రంగాల్లోని సుమారు 3800 ఉద్యోగుల్లో 76 శాతం మంది హైబ్రిడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈ విధానం కాదంటే కొత్త ఉద్యోగాలను అన్వేషించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పనిచేయాల్సిన రోజుల సంఖ్యను పెంచాలనే యజమానులు నిర్ణయాన్ని 35 శాతం మంది ఆహ్వానిస్తున్నారు.

చ‌ద‌వండి: శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి? (గ్రూప్-1, 1991)

జేపీ మోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ సాచ్స్, మెటా, టీసీఎస్ కంపెనీలు సైతం తప్పకుండ ఆఫీసులకు రావాలని తమ ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి. అంతే కాకుండా జూమ్ సంస్థ కూడా 50 కిమీ దూరంలో ఉన్న ఎంప్లాయిస్ వారానికి రెండు రోజులు కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. ఉద్యోగులకు, కంపెనీలకు సామరస్యంగా ఉండాలంటే హైబ్రిడ్ విధానం పాటించడం మంచిది. వేగంగా పరుగులు పెడుతున్న ప్రపంచంతో పోటీపడాలంటే అనుభవజ్ఞులైన ఉద్యోగులు చాలా అవసరమని సీఐఈఎల్ హెచ్ఆర్ సత్యనారాయణ అన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఫ్లెక్సిబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

చ‌ద‌వండి: తెలంగాణ‌లోని ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగుల క్రమబద్ధీకరణ

Published date : 28 Aug 2023 05:45PM

Photo Stories