Skip to main content

Tesla Company Layoffs: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు

Tesla Company Layoffs   Tesla CEO Elon Musk  Tesla layoffs  Job cuts at Tesla

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.

ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు ప‌లువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. త‌మ‌కు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్‌లో షేర్ చేయ‌డంతో ఈ వివ‌రాలు వెలుగులోకి వచ్చాయి.

Anand Mahindra Extends Help To Viral Delhi Boy: నాన్న చనిపోయాడు, అమ్మ వదిలేసింది.. సొంతంగా ఫుడ్‌ బిజినెస్.. సెన్సేషన్‌గా మారిన పదేళ్ల పిల్లాడు‌

టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్‌మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.

ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.

Published date : 07 May 2024 05:29PM

Photo Stories