Skip to main content

Amazon layoff: అమెజాన్ ఉద్యోగులు విల‌విల‌... హెచ్ఆర్‌, ఏడ‌బ్ల్యూఎస్ ఉద్యోగులకు క‌న్నీళ్లే.. తాజాగా హాలో యాప్ పూర్తిగా నిలిపివేత

అమెజాన్... త‌న‌కు ఏ మాత్రం లాభ‌సాటిగా లేక‌పోయినా ఇక‌పై దాన్ని వ‌దిలించుకోవాల‌ని చూస్తోంది. ప్ర‌పంచ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ప్ర‌తీ విభాగంలో ఏలు పెట్టుకుంటూ పోయింది. ఈ కామ‌ర్స్ సేవ‌ల‌తో పాటు, నూత‌న టెక్నాల‌జీతో ప‌ని చేసే వివిధ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అంద‌జేసేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే తాను అనుకున్న మేర‌కు ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో వాటిన‌న్నింటిని వ‌దిలించుకుంటోంది.
Amazon-layoff
Amazon-layoff

అందులో ప‌నిచేసే ఉద్యోగుల‌ను నిర్దాక్షిణ్యంగా ఇంటికి సాగ‌నంపుతోంది. తాజాగా అమెజాన్ హాలో ను పూర్తిగా మూసేసింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి... 

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ జాబ్ దొర‌క‌డం ఇంత క‌ష్ట‌మా... 150 కంపెనీల‌కు అప్లై చేస్తే...!

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్... అమెజాన్ హాలో పేరిట హెల్త్‌, వెల్‌నెస్ స‌ర్వీస్‌ను 2020లో ప్రారంభించింది. ఈ స‌ర్వీస్‌ను తీసుకునే వారికి అమెజాన్ హాలో స్మార్ట్‌బ్యాండ్‌ను ఇస్తారు. దీంతోపాటు ఫోన్ లో అమెజాన్ హాలో యాప్ ను వాడుకోవ‌చ్చు. రెండింటికీ క‌లిపి రూ. 9 వేల వ‌ర‌కు చార్జ్ చేసేవారు. ఇందులో యాక్స‌ల‌రోమీట‌ర్‌, టెంప‌రేచ‌ర్ సెన్సార్‌, హార్ట్ రేట్ మానిట‌ర్‌, రెండు మైక్రోఫోన్లు, ఎల్ఈడీ ఇండికేట‌ర్ లైట్‌, మైక్రోఫోన్ల‌ను ఆన్‌, ఆఫ్ చేసే బ‌ట‌న్లు ఉంటాయి.  

Amazon Halo View

హాలో యాప్ చేతికి ధ‌రించిన హాలో బ్యాండ్‌కు క‌నెక్ట్ అవుతుంది. దీని స‌హాయంతో నిద్ర‌, ఎక్స‌ర్‌సైజ్‌, సెడెంట‌రీ టైమ్ త‌దిత‌ర యాక్టివిటీల‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. అలాగే బాడీ ఫ్యాట్ శాతం ఎంత ఉందో తెలుసుకోవ‌చ్చు. దీంతోపాటు యూజ‌ర్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడా లేదా అని అత‌ని గొంతును ట్రాక్ చేసి చెబుతుంది. ఈ విధంగా అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను హాలో యాప్, హాలో బ్యాండ్‌ల‌లో అంద‌జేస్తూ వ‌చ్చింది.

చ‌ద‌వండి: ఉద్యోగుల‌కు మ‌రో షాక్ ఇచ్చిన గూగుల్‌... ఇక‌పై అవ‌న్నీ కుద‌ర‌వు..!

దీన్ని లాభ‌సాటిగా లేక‌పోవ‌డంతో అమెజాన్ హాలో వ్యూ(Amazon Halo View), అమెజాన్ హాలో బ్యాండ్‌(Amazon Halo Band), అమెజాన్ హాలో రైజ్‌(Amazon Halo Rise), అమెజాన్ హాలో అక్సెస‌రీ బ్యాండ్స్‌(Amazon Halo accessory bands)ల‌ను పూర్తిగా నిలిపివేసింది. ఆగ‌స్ట్ నుంచి ఈ సేవ‌లు వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉండ‌వ‌ని... ఇప్ప‌టికే స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న వారికి డ‌బ్బుల‌ను రీఫండ్ చేస్తామ‌ని సంస్థ తెలిపింది. 

Amazon Halo View

గ‌త ఏడాది నవంబ‌ర్‌లో 18,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు అమెజాన్ ప్ర‌క‌టించిన అనంత‌రం మార్చిలో సీఈవో అండీ జ‌స్సీ 9000 మంది ఉద్యోగుల‌పై వేటు వేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా ఏప్రిల్ 18న అడ్వ‌ర్టైజింగ్ యూనిట్‌కు చెందిన ప‌లువురు ఉద్యోగుల‌ను అమెజాన్ సాగ‌నంపింది. ఆర్ధిక మాంద్యం భ‌యాలు వెంటాడ‌టంతో అమెజాన్ ప‌లు ప్రాజెక్టుల‌ను నిలిపివేయడం, హైరింగ్‌ను కుదించ‌డంతో పాటు వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది.

Published date : 27 Apr 2023 03:31PM

Photo Stories