Skip to main content

New Courses in IITs: మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ప్రవేశం విధానం, కెరీర్‌ అవకాశాలు ఇవే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లు ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా విద్యార్థుల కోసం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాయి. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఐఐటీ గాంధీనగర్‌ బీటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సును రూపొందించింది. ఐఐటీ-ఇండోర్, ఐఐటీ-పాట్నాలో బీటెక్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఫిజిక్స్, ఐఐటీ బాంబేలో డ్యూయల్‌ డిగ్రీ ఇన్‌ క్వాంటం టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు తగిన కోర్సు ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఆయా కోర్సుల తీరుతెన్నులు, ప్రవేశం విధానం, కెరీర్‌ అవకాశాలు తదితర వివరాలు..
New Courses in IITs

ఐఐటీ ఇండోర్‌
ఈ ఏడాది ఐఐటీ ఇండోర్‌ ఎక్కువ సంఖ్యలో కొత్త కోర్సులను ప్రారంభించింది. బీటెక్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఫిజిక్స్, బీటెక్‌ ఇన్‌ మ్యాథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్, బీటెక్‌ ఇన్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ ఇండోర్‌ ఈ కోర్సులలో ప్రవేశాలను ప్రారంభించనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

చ‌ద‌వండి: CSE craze in IITs: ఐఐటీల్లో సీఎస్‌ఈ క్రేజ్‌

ఐఐటీ పాట్నా
ఐఐటీ పాట్నా ఈ సంవత్సరం ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌లో కొత్తగా బీటెక్‌ను ప్రారంభించింది. ఫిజిక్స్‌లో ధ్వని శిక్షణ, విద్యార్థులకు సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. సమకాలీన ఫిజిక్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ను మిళితం చేసి విద్యార్థులను సైన్స్‌, టెక్నాలజీ రెండింటిలో సమాన సామర్థ్యాలుండే నిపుణులుగా తీర్చిదిద్దడమే ఈ కోర్సు లక్ష్యం.

IIT Bombay

ఐఐటీ బాంబే
ఐఐటీ బాంబే క్వాంటమ్‌ టెక్నాలజీలో ఇంటర్‌ డిసిప్లినరీ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఐఐడీడీపీ)ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కోర్సును సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ క్వాంటం ఇన్ఫర్మేషన్‌ కంప్యూటింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(క్యూయూఐసీఎస్‌టీ) ఆఫర్‌ చేస్తోంది. ఐఐటీ బాంబేలో ఏదైనా బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటెక్‌) కోర్సులో చేరిన విద్యార్థులు ఐఐడీడీపీ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవచ్చు. డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ నిర్మాణం ఇంకా ఖరారుకానప్పటిMీ .. రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఈ కోర్సులో క్వాంటం టెక్నాలజీతోపాటు క్యూయూఐసీఎస్‌టీకి అనుబంధంగా ఉన్న పరిశోధనా బృందంతో చేపట్టే ప్రాజెక్ట్‌ వర్క్‌కు ప్రాధాన్యతనివ్వనున్నారు. ఇతర డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ల మాదిరిగానే ఈ కొత్త కోర్సులో చేరిన విద్యార్థులు ఐదేళ్ల వ్యవధిలో బ్యాచిలర్స్, మాస్టర్స్‌ డిగ్రీని పూర్తిచేస్తారు. బీటెక్‌ విద్యార్థులు సంబంధిత కోర్సు మూడవ సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవచ్చు. 

చ‌ద‌వండి: Campus Placement: క్యాంపస్‌ ఆఫర్ల మేళ.. రూ.కోటికి పైగా వేతనం

ఐఐటీ జోధ్‌పూర్‌
ఐఐటీ జోధ్‌పూర్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌.. కొత్తగా బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఫిజిక్స్‌ విత్‌ స్పెషలైజేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. బేసిక్‌ సైన్స్‌, అత్యాధునిక సాంకేతికతలపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఈ కోర్సును తీసుకువచ్చారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణమైన స్పెషలైజేషన్ల ద్వారా వివిధ కెరీర్‌ మార్గాలను అందించడం ఈ కోర్సు లక్ష్యం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్కోరు ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల ఈ ప్రోగ్రామ్‌ను ఎనిమిది సెమిస్టర్‌లుగా విభజించారు.

IIT Hyderabad

ఐఐటీ హైదరాబాద్‌
ఐఐటీ, హైదరాబాద్‌.. బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్‌లో పరిశ్రమ ఆధారిత బీటెక్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సును అభ్యసించే విద్యార్థులు బయోలాజికల్‌ డేటాను అర్థం చేసుకోవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌లోనూ శిక్షణ పొందుతారు. ఇది ఎనిమిది సెమిస్టర్లు, నాలుగేళ్ల కాలవ్యవధి ఉన్న ఫుల్‌టైమ్‌ కోర్సు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు.

ఐఐటీ గాంధీనగర్‌
ఐఐటీ, గాంధీనగర్‌.. బీటెక్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సును ప్రవేశపెట్టింది. దీనిలోని కొన్ని సబ్జెక్టులు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లోని సబ్జెక్టులతో ఉమ్మడిగా ఉన్నప్పటికీ.. చాలా సబ్జెక్టులు భిన్నంగా ఉన్నాయి. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌Š లో విద్యార్థులు పట్టుసాధించేలా కరిక్యులాన్ని రూపొందించారు. అంతేకాకుండా ఎలక్టివ్స్‌ సౌకర్యం ఉండటంతో విద్యార్థులు ఏఐకు చెందిన వివిధ విభాగాలు, కంప్యూటర్‌ విజన్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ తదితర అడ్వాన్స్‌డ్‌ ఏఐ అంశాలను ప్రత్యేకంగా ఎంచుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా విద్యార్థులు పరిశ్రమలో అప్లయిడ్‌ ఏఐలో అద్భుత కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు. బీటెక్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సును నాలుగేళ్లు, ఎనిమిది సెమిస్టర్‌లుగా పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్కోర్‌ ఆధారంగా దీనిలో ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ పాట్నా, ఐఐటీ గువాహటిలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

చ‌ద‌వండి: Part Time Jobs: చదువుతోపాటు సంపాదన!

Published date : 04 Jul 2023 06:37PM

Photo Stories