Skip to main content

Mock Test for Students: సాక్షి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్‌ టెస్ట్‌.. ఎప్పుడు..?

విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈ ఏపీసెట్, నీట్‌ పరీక్షలకు ‘సాక్షి’ మాక్‌ టెస్ట్‌లు నిర్వహించనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రకటించిన వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలి. పూర్తి వివరాలను పరిశీలించండి..
Mock Test for Engineering and Medical students under 'Sakshi'

సాక్షి ఎడ్యుకేషన్‌: ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం..ఇంజినీరింగ్, లేదా మెడిసిన్‌. అధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజినీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌..అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించే ఈఏపీసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.

Artificial Intelligence: భవిష్యత్తు అంతా ఏఐ మయమే.. జీ20 నిర్వహణతో ప్రపంచ గుర్తింపు!!

విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈ ఏపీసెట్, నీట్‌ పరీక్షలకు ‘సాక్షి’ మాక్‌ టెస్ట్‌లు నిర్వహించనుంది. దీనికి టెక్నాలజీ పార్ట్‌నర్‌గా ‘మై ర్యాంక్‌’ వ్యవహరిస్తోంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్ష లాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్స్‌ స్థాయిని అంచనా వేసుకుని, దాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://www.arenaone.in/mock ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

TET Notification 2024: 11,602 టీచర్‌ పోస్ట్‌లు.. టెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.250గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఏప్రిల్‌ 22 చివరి తేదీ. రిజిస్టర్‌ చేసుకున్న      ఈ-మెయిల్‌కు హాల్‌ టికెట్‌ నంబర్‌ వస్తుంది. ఏప్రిల్‌ 27న నీట్, ఏప్రిల్‌ 28న ఈఏపీసెట్‌ అగ్రికల్చర్, ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటు­లో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. పరీక్ష రాసేందుకు మూడు (3) గంటల సమయాన్ని కేటాయించారు.

Railway Jobs 2024: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఈ పరీక్షలకు హాల్‌ టికెట్‌ నంబర్‌ (యూజర్‌ నేమ్‌), ఫోన్‌ నెంబర్‌ (పాస్‌వర్డ్‌)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్‌ అయ్యి రాసుకోవచ్చు. పరీక్ష ముగిసిన వెంటనే స్కో­ర్‌ను చెక్‌ చేసుకోవచ్చు. మాక్‌ పరీక్షలను https://sakshimocktest.myrank.co.in లో నిర్వ­హిస్తారు. టెస్ట్‌ కీ ని ఏప్రిల్‌ 30న ఇదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. పూర్తి వివరాలకు 95055 14424, 96660 13544, 96665 72244 నంబర్లకు కాల్‌ చేయవచ్చు.

 OSSC Exams: ప్రశాంతంగా సాగిన ఓఎస్‌ఎస్‌సీ పరీక్ష

Published date : 29 Mar 2024 03:18PM

Photo Stories