Skip to main content

TSBIE: ఇంటర్‌ విద్యార్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్, నీట్‌ పరీక్షల కోచింగ్‌ తీసుకోబోయే ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఫిబ్రవరిలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ నిర్ణయించింది.
Screening test for inter students
ఇంటర్‌ విద్యార్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌

వడపోత ప్రక్రియ ద్వారా జిల్లాకు వంద మంది చొప్పున ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వాలనే యోచనలో ఉంది. పోటీ పరీక్షల కోచింగ్‌ మెటీరియల్‌ను మాత్రం విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. కాలేజీల స్థాయిలో సాధారణ కోచింగ్‌కూ అందరినీ అనుమతిస్తారు. దీని ఆధారంగా మంచి ర్యాంకులు సాధించేవారిని గుర్తించాలని యోచిస్తున్నారు. వీరికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడం వల్ల నీట్, ఎంసెట్‌లో ర్యాంకులు సాధించే ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారు. వాస్తవానికి డిసెంబర్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సిలబస్‌ పూర్తిచేసి, జనవరి నుంచి ఎంసెట్, నీట్‌ కోచింగ్‌ను ప్రతీ ప్రభుత్వ కాలేజీలో చేపట్టేందుకు అనువుగా బోర్డ్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ |ఏపీ ఇంటర్

వడపోత దేనికంటే..?:

కరోనా వల్ల టెన్త్‌లో సరైన పరీక్ష విధానం లేకుండానే చాలామంది ఇంటర్‌కు రావడంతో రెండేళ్లుగా ప్రవేశాలు పెరిగాయి. ప్రస్తుతం రెసిడెన్షియల్, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లక్ష మందికిపైగా సెకండియర్‌ విద్యార్థులున్నారు. 55 వేల మంది ఎంసెట్‌లో ప్రతిభ చూపే అవకాశం కన్పిస్తోంది. మిగతా 45 వేల మందిలో 20 వేల మంది వరకూ పెద్ద ర్యాంకులు రాకున్నా ఎంసెట్‌లో అర్హత సాధించే స్థాయిలో ఉన్నారని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా బోర్డ్‌ గుర్తించింది. 

స్క్రీనింగ్‌ ఇలా... 

రెండేళ్ల ఇంటర్‌ సిలబస్‌ను కొలమానంగా తీసుకుని ప్రత్యేక పరీక్ష విధానం రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేథ్స్‌ పేపర్‌ను 60, ఇతర సబ్జెక్టు పేపర్లను 40 మార్కులకు స్క్రీ నింగ్‌ టెస్ట్‌ పెట్టాలని నిపుణులు సూచించారు. నీట్‌కు వెళ్లేవారికి బాటనీ, జువాలజీ నుంచి 60 మార్కులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 40 మార్కులతో పేపర్‌ ఇవ్వాలని నిర్ణయించారు. మల్టీపుల్‌ చాయిస్‌తో ఉండే ఈ పేపర్‌లో విద్యార్థి 50 శాతం మార్కులకుపైగా సాధిస్తే ప్రత్యేక కోచింగ్‌కు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. మెరుగైన విద్యార్థులకే ఉచితకోచింగ్‌ ఇవ్వడంపై విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీల మాదిరిగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. 

Published date : 10 Dec 2022 02:54PM

Photo Stories