కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు.
నవోదయ 9వ తరగతి ఫలితాలు విడుదల
ఐదు ఖాళీ సీట్లకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహించగా ప్రతిభ, రిజర్వేషన్‌ల ప్రాతిపదికన విద్యాలయ సమితి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఓపెన్ కోటాలో చోలె పార్థ (271024), ఓపెన్ ఎస్సీ కోటాలో కె.వినయ్ (271397), రూరల్‌కోటాలో నోముల ఆశ్మీత (271513), రూరల్ బాలికల ఓబీసీ కోటాలో ప్రీతి (271310), దివ్యాంగుల కోటాలో కె.అభిషేక్ (271281) ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 17న తమ ధ్రువీకరణ ప త్రాలతో విద్యాలయానికి రావాలని సూచించారు.