10th class exam dates: 10వ తరగతి పరీక్షల తేదీలు ఇవే..
Sakshi Education
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 16 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లు స్టడీసెంటర్లలో లేదా డబ్లూడబ్లూడబ్లూ. తెలంగాణ ఓపెన్‌స్కూల్ ఓఆర్‌జీ వెబ్‌సైట్‌నుంచి పొందాలని హనుమకొండ జిల్లా డీఈవో అబ్దుల్‌హై, పరీక్షల సహాయ నిర్వహణ అధికారి చలపతిరావు, ఓపెన్ స్కూల్‌ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Download TS 10th Class Study Material
టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయన్నారు. టెన్త్‌లో 422 మంది, ఇంటర్‌లో 597 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని వారు తెలిపారు.
Published date : 13 Oct 2023 01:34PM