ట్రిపుల్ ఐటీలో డ్యుయల్ డిగ్రీకి దరఖాస్తులు ఆహ్వానం
Sakshi Education
రాయదుర్గం: హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు లేటరల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తులు ఆహా్వనించింది.
దరఖాస్తుదారులు లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ఎగ్జామినేషన్ (ఎల్‌ఈఈఈ) రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులు అయినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైనవారికి కోర్సులో అడ్మిషన్ కల్పిస్తారు. ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బై రీసెర్చ్ (ఈసీడీ)లో చేరేందుకు జూలై 2021లో బీఈ/బీటెక్ ఈసీఈ, ఈటీఈ, ఈఐఈ, ఈఈఈ విభాగాల్లో సెకండియర్ పూర్తయ్యే విద్యార్థులు, కంప్యూటర్ సైన్స్అండ్ ఇంజనీరింగ్ బై రీసెర్చ్ (సీఎస్‌డీ)లో చేరేందుకు బీఈ/బీటెక్ సీఎస్‌ఈ, ఐటీ విభాగాల్లో సెకండియర్ పూర్తయ్యే విద్యార్థులు అర్హులు. దరఖాస్తులను మార్చి 24వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్షను ఏప్రిల్ 18న నిర్వహిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్‌లు: https://ugadmissions.iiit.ac.in/leee_page.html
మెయిల్: pgadmissio ns@iiit.ac.in సందర్శించాలి.
వివరాలకు వెబ్‌సైట్‌లు: https://ugadmissions.iiit.ac.in/leee_page.html
మెయిల్: pgadmissio ns@iiit.ac.in సందర్శించాలి.
Published date : 15 Mar 2021 04:06PM