Skip to main content

స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఉన్నత స్థాయి సలహా కమిటీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాల నుంచి సత్ఫలితాలు రాబట్టేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సలహా కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల విధివిధానాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సుల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఈ కమిటీ తగు సూచనలు చేస్తుంది. సియాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఎడ్యుకేషన్ ఎండీ ఆర్‌సీఎం రెడ్డి (మాజీ ఐఏఎస్ అధికారి), శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, సెంచూరియన్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ డీఎన్ రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ సభ్య కన్వీనర్‌గా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో ఆర్జా శ్రీకాంత్ వ్యవహరిస్తారని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 11 Sep 2020 02:32PM

Photo Stories