ఐఐటీ విద్యార్థినికి కేటీఆర్ చేయూత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఐఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఆర్థిక సాయం అందజేశారు.
వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన మేకల అంజలి గతేడాది ఇండోర్ ఐఐటీలో సీటు సాధించింది. తన తండ్రి రమేశ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారని, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాయం చేయాల్సిందిగా కేటీఆర్‌కు వారు ట్విట్టర్‌లో విజ్ఞప్తిచేశారు. అంజలికి మొదటి ఏడాది ఫీజును సాయం చేసిన కేటీఆర్.. ఐఐటీలో చదువు పూర్తి చేసేందుకు అవసరమయ్యే ఖర్చును కూడా తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అంజలి రెండో ఏడాదికయ్యే ఖర్చుతో పాటు ల్యాప్‌టాప్ కొనుగోలుకు అవసరమైన రూ.1.50 లక్షలను కేటీఆర్ ఆగస్టు 10న ప్రగతిభవన్‌లో అందజేశారు. కేటీఆర్ తనకు చేయూత ఇవ్వడంపై అంజలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 11 Aug 2020 02:14PM