ఒక విద్యార్థినిపార్లమెంట్లో చట్టాలు ఏ విధంగా రూపొందుతాయో వివరించింది.’ ఇది ఎలాంటి లక్ష్యం?
1. ‘మాధవి అనే విద్యార్థిని నూతన పరికల్పనను రూపొందించింది.’ దీని ద్వారా సాధించిన లక్ష్యం ఏమిటి?
1) అవగాహన
2) వినియోగం
3) అభిరుచి
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 2
2. ‘సంధ్య అనే విద్యార్థిని పార్లమెంట్లో చట్టాలు ఏ విధంగా రూపొందుతాయో వివరించింది.’ ఇది ఎలాంటి లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 2
3. ‘గ్రామపంచాయతీ, పురపాలక సంఘాల విధుల్లో ఉన్న భేదాలను పేర్కొనండి.’ ఈ ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది?
1) నైపుణ్యం
2) అభిరుచి
3) అవగాహన
4) వినియోగం
- View Answer
- సమాధానం: 3
4. ‘రాజేష్ అనే విద్యార్థి పాఠశాలలో జరిగే వస్తు ప్రదర్శనను శ్రద్ధగా నిర్వహించాడు.’ఇది ఏ విధమైన లక్ష్యం?
1) అభిరుచి
2) వైఖరి
3) ప్రశంస
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 1
5. ‘దేశ జనాభా పెరుగుదలను అరికట్టడానికి నీవు ఎలాంటి సూచనలు ఇస్తావు?’ అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది?
1) అభిరుచి
2) వైఖరి
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 3
6.‘జాహ్నవి అనే విద్యార్థిని భారతదేశ చరిత్ర-సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించింది.’ ఇది ఏ విధమైన లక్ష్యం?
1) అభిరుచి
2) వైఖరి
3) ప్రశంస
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 2
7. ‘పదో తరగతి విద్యార్థి.. చెరుకు పండించే ప్రాంతాల్లో చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు స్థాపించారో విశ్లేషించాడు.’ ఇది ఏ విధమైన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 3
8. ‘పదో తరగతి విద్యార్థి.. చెరుకు పండించే ప్రాంతాల్లో చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు స్థాపించారో విశ్లేషించాడు.’ ఇది ఏ విధమైన లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 1
9. ‘శ్యామల అనే విద్యార్థిని డిమాండ్, సప్లయిలకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించింది.’ ఇది ఏ విధమైన లక్ష్యం?
1) అవగాహన
2) వినియోగం
3) నైపుణ్యం
4) అభిరుచి
- View Answer
- సమాధానం: 1
10. ‘ఆదిత్య అనే విద్యార్థి థర్మామీటర్, భారమితిల్లో రీడింగ్‌ను కచ్చితంగా పేర్కొన్నాడు.’ ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏది?
1) అభిరుచి
2) నైపుణ్యం
3) జ్ఞానం
4) ప్రశంస
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో ‘వినియోగం’ అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏది?
1) సాధారణీకరించడం
2) పరిష్కారం సూచించడం
3) సంబంధాలను గుర్తించడం
4) ఫలితాలను ఊహించడం
- View Answer
- సమాధానం: 3
12.నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఏ రంగానికి చెందుతుంది?
1) జ్ఞాన రంగం
2) భావావేశ రంగం
3) జ్ఞానేతర రంగం
4) మానసిక చలనాత్మక రంగం
- View Answer
- సమాధానం: 1
13. ‘విధేయత, వ్యక్తిగత సామాజిక బాధ్యతలాంటి అంశాలను విద్యార్థులకు పెంపొందించడం.’ అనేది ఏ లక్ష్యానికి చెందింది?
1) అవగాహన
2) జ్ఞానం
3) నైపుణ్యం
4) వైఖరి
- View Answer
- సమాధానం: 4
14. ‘బడ్జెట్ పాఠం విన్న విద్యార్థి ప్రభుత్వం ప్రవేశపెట్టే లోటు బడ్జెట్ వల్ల కలిగే ఫలితాలను ఊహించగలిగాడు.’ దీని ద్వారా నెరవేరిన లక్ష్యం ఏది?
1) వినియోగం
2) జ్ఞానం
3) అవగాహన
4) అభిరుచి
- View Answer
- సమాధానం: 1
15. ‘ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరుచేయండి.’ ఈ ప్రశ్న ఏ విధమైన లక్ష్యానికి చెందింది?
1) అవగాహన
2) నైపుణ్యం
3) వినియోగం
4) జ్ఞానం
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో విద్యా ప్రణాళికల విషయాన్ని బట్టి మారనిది ఏది?
1) ఆశయం
2) లక్ష్యం
3) బోధనా పద్ధతి
4) స్పష్టీకరణ
- View Answer
- సమాధానం: 1
17. ‘ప్రతి పౌరుడు నిర్వహించే ప్రాథమిక విధులను ఓ విద్యార్థి వివరించగలుగుతాడు.’ అనేది ఏ లక్ష్యానికి చెందింది?
1) జ్ఞానం
2) వినియోగం
3) అవగాహన
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 3
18. ‘సౌరకుటుంబం’ అనే పాఠాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఒక రోజు స్నేహితులతో కలిసి నక్షత్రశాలను చూసి వచ్చాడు. దీన్ని ద్వారా అతడు ఏ లక్ష్యం సాధించాడని చెప్పవచ్చు?
1) వైఖరి
2) అభిరుచి
3) నైపుణ్యం
4) ప్రశంస
- View Answer
- సమాధానం: 2
19. ‘మీకిచ్చిన ఆంధ్రప్రదేశ్ పటంలో థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలను గుర్తించండి.’ అనేది ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది?
1) వైఖరి
2) జ్ఞానం
3) వినియోగం
4) నైపుణ్యం
- View Answer
- సమాధానం: 4
20.కింది వాటిలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది?
1) విచక్షణ చేయడం
2) ఉదాహరణలు
3) సాధారణీకరించడం
4) నమూనాలను తయారు చేయడం
- View Answer
- సమాధానం: 3
21. ‘ఒక విద్యార్థి.. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షానికి ఉదాహరణగా పేర్కొన్నాడు.’ ఇది ఏ విధమైన లక్ష్యం?
1) అవగాహన
2) నైపుణ్యం
3) జ్ఞానం
4) వినియోగం
- View Answer
- సమాధానం: 1
22. ‘ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి పాత్రను విద్యార్థి అభినందించాడు.’ ఇది ఏ విధమైన లక్ష్యం?
1) జ్ఞానాత్మక రంగం
2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) జ్ఞానేతర రంగం
- View Answer
- సమాధానం: 2