Skip to main content

South Central Railway Jobs : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో.. సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దక్షిణ మధ్య రైల్వే 4103 అప్రెంటిస్ ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్న‌ది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆసక్తి ఉన్న అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జనవరి 29వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
RRB Exams
RRB Jobs

SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. మిగతా అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు 50 శాతం మార్కులతో ప‌దో త‌ర‌గ‌తి లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. అలాగే ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ క్వాలిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు.

☛ 2422 Railway Jobs: ఆర్‌ఆర్‌సీ-సెంట్రల్‌ రైల్వేలో పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

వ‌యోప‌రిమితి ఇలా : 
నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 30, 2022 నాటికి కనిష్టంగా 15 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.

➤ OBC అభ్యర్థులు : 3 సంవత్సరాలు

➤ SC/ST అభ్యర్థులు : 5 సంవత్సరాల

➤ PWD అభ్యర్థులు : 10 సంవత్సరాలు

పోస్టుల వివ‌రాలు ఇవే..:

rrb
పోస్టు ఖాళీలు
ఏసీ(AC) మెకానిక్ 250
కార్పెంటర్ 18
డీజిల్ మెకానిక్ 531
ఎలక్ట్రీషియన్ 1019
ఎలక్ట్రానిక్ మెకానిక్ 92
ఫిట్టర్ 1460
మెషినిస్ట్ 71
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 5
మిల్ రైట్ మెయింటెనెన్స్ 24
పెయింటర్ 80
వెల్డర్ 553
మొత్తం 4103

4103 పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 02 Jan 2023 06:58PM
PDF

Photo Stories