NEET: ప్రవేశపరీక్షకు రికార్డు దరఖాస్తులు
Sakshi Education
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ప్రవేశ పరీక్ష రాయడానికి 2023లో 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దేశంలోనే అతి పెద్దదైన ఈ ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 20.87 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంఖ్య 2.57 లక్షలు ఎక్కువ. ఈసారి అమ్మాయిలు ఎక్కువ మంది పరీక్ష రాస్తూ ఉండడం విశేషం.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
మొత్తం రిజిస్ట్రేషన్లలో అమ్మాయిలు 11.8 లక్షలున్నారు. అబ్బాయిల కంటే 2.8 లక్షలు అధికంగా మెడికల్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షకి హాజరుకానున్నారు. మే 7న నీట్ పరీక్ష జరగనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా అభ్యర్థులు ప్రవేశ పరీక్షలకు హాజరు కానుండగా, ఆ తర్వాత స్థానంలో యూపీ నిలిచింది.
Published date : 22 Apr 2023 03:51PM