Skip to main content

NEET UG 2024: నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ నిజమే

NEET UG 2024: నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ  నిజమే
NEET UG 2024: నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ నిజమే

పట్నా: బిహార్‌లో చోటుచేసుకున్న నీట్‌–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పేపర్‌ లీక్‌ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

ఈ కేసులో బిహార్‌ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నీట్‌ అభ్యర్థులు అనురాగ్‌ యాదవ్, శివానందన్, అభిషేక్, ఆయుష్‌ రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్‌ ఆనంద్‌తోపాటు ప్రభుత్వ జూనియర్‌ ఇంజనీర్‌ సికిందర్‌ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్  . విచారణలో నిందితులు ఏం చెప్పారో వారి మాటల్లోనే...  

‘‘బిహార్‌ దానాపూర్‌ టౌన్‌ కౌన్సిల్‌లో జూనియర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికిందర్‌ ప్రసాద్‌ యాదవేందు మమ్మల్ని సంప్రదించాడు. మేనల్లుడు అనురాగ్‌సహా నలుగురికి ప్రశ్నపత్రం ఇచి్చ యాదవేందు నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాం’’  
                                                                         – నితీశ్, అమిత్, 

‘‘ అమిత్, నితీశ్‌ ప్రశ్నపత్రం, కీ అందజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి సహకరించారు’  
                                                                        – అనురాగ్, నీట్‌ అభ్యర్థి   

‘‘యాదవేందు అంకుల్‌ మే 4న ఓ ఇంటికి రమ్మని చెప్పాడు. అక్కడ నితీశ్, అమిత్‌  ప్రశ్నపత్రం ఇచ్చి నన్ను పరీక్షకు సిద్ధం చేశారు’’ 
                                                                       – శివానందన్‌ కుమార్, నీట్‌ అభ్యర్థి  

‘‘నీట్‌ ప్రశ్నపత్రం కోసం యాదవేందుకు రూ.40 లక్షలు చెల్లించాం’’ 
                                                                         –అవదేశ్,  అభిషేక్‌ కుమార్‌ తండ్రి  

‘‘యాదవేందు రూ.40 లక్షలు తీసుకున్నాడు’’  
                                                                          –  నీట్‌ అభ్యర్థి ఆయుష్‌ రాజ్‌ తండ్రి  

‘‘రాజస్తాన్‌లోని కోటాలో శిక్షణ పొందుతున్న నా మేనల్లుడు అనురాగ్‌ యాదవ్‌ నా సోదరి రీనా కుమారితో కలిసి నీట్‌ పరీక్ష రాయడానికి పాట్నా వచ్చాడు. వారికి పాటా్నలో ప్రభుత్వ అతిథి గృహంలో నేనే బస ఏర్పాట్లు చేశా. నీట్‌ పరీక్ష రాయడానికి నా మేనల్లుడు సహా నలుగురి అభ్యర్థులకు సహకరించా. నలుగురికి ప్రశ్నపత్రాలు సమకూర్చా. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల చొప్పున డిమాండ్‌ చేశా. నితీశ్‌ కుమార్, అమిత్‌ ఆనంద్‌ రూ.32 లక్షల చొప్పున తీసుకున్నారు’’  
                                                                               – యాదవేందు, ప్రభుత్వ జూనియర్‌ ఇంజనీర్‌  

Also Read: NEET UG 2024 Paper Leak Live Updates

తేజస్వీ యాదవ్‌ సహాయకుడి హస్తం!  
ప్రభుత్వ అతిథి గృహంలో అనురాగ్‌ యాదవ్, ఆయన తల్లికి బస ఏర్పాట్ల వెనుక బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గెస్టు హౌస్‌ బిల్లులను పరిశీలించగా, అందులో మంత్రిజీ అని ఉంది. తేజస్వీ యాదవ్‌ వ్యక్తిగత సహాయకుడైన ప్రీతమ్‌ కుమార్‌ ఈ గెస్టు హౌస్‌ను బుక్‌ చేసేందుకు యాదవేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  

Published date : 22 Jun 2024 09:42AM

Photo Stories