నీట్ యూజీ–2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Sakshi Education
NEET UG–2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను Medical Counseling Committee (MCC) ఆక్టోబర్ 3న విడుదల చేసింది.
. ఆల్ ఇండియా కోటా తొలి దశ కౌన్సెలింగ్ ఆక్టోబర్ 11న ప్రారంభమై 20వ తేదీ వరకు ఉంటుంది. మరో వైపు డీమ్డ్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్‌లో 10వ తేదీ నుంచి 20 మధ్య తొలి దశ కౌన్సెలింగ్ ఉండనుంది. రాష్ట్రాల్లో తొలి దశ కౌన్సెలింగ్ 17వ తేదీ నుంచి 28 వరకు ఉంటుంది. ఆల్ ఇండియా, డీమ్డ్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ రెండో దశ కౌన్సెలింగ్ నవంబర్ 2–10, స్టేట్ కౌన్సెలింగ్ 7–18వ తేదీ మధ్య ఉండనుంది. మాప్–అప్ రౌండ్ ఆల్ ఇండియా, డీమ్డ్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ మధ్య, రాష్ట్రాల్లో డిసెంబర్ 6 నుంచి 12వ తేదీ మధ్య నిర్వహిస్తారు. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
చదవండి:
NEET 2022: రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు విడుదల.. టాప్ ర్యాంకర్లు విరే..
Published date : 04 Oct 2022 04:52PM