Jay Shah: వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ సలహా మండలిలో జై షా

కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (WCC) సలహా మండలిలో చోటు దక్కింది. క్రికెట్ ప్రపంచంలో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఇండిపెండెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ బోర్డు.. 2024లో లార్డ్స్‌లో జరిగిన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ ఫోరంలో 120 మంది ప్రముఖ క్రికెట్ వక్తలతో జరిగిన చర్చల నుంచి ఏర్పడింది. జై షా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మాజీ కార్యదర్శి.
డబ్ల్యూసీసీ మొదటి సమావేశం జూన్ 7, 8 తేదీల్లో లార్డ్స్ వేదికగా జరగనుంది. ఇందులో ప్రస్తుత కెప్టెన్‌లు, మాజీ క్రికెటర్లు, ప్రసార సంస్థల ప్రతినిధులు సహా పలువురికి సలహా మండలిలో చోటి కల్పించారు. ఇండియా నుంచి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఐసీసీ సీసీఓ అనురాగ్ దహియా, జియో స్టార్ సీఈఓ సంజోగ్ గుప్తాకి అవకాశం దక్కింది.
FIDE Rankings: ఫిడే ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో గుకేశ్.. భారత నంబర్‌వన్‌గా..