NEET: నీట్ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
Sakshi Education
వైద్య విద్య 2021–22 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సెప్టెంబర్ 12న నిర్వహించనున్న నీట్ (యూజీ), 2021 వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారించింది. సెప్టెంబర్ 6న బయాలజీ, సెప్టెంబర్ 9న ఫిజిక్స్ సీబీఎస్ఈ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయాలని న్యాయవాది సుమంత్ నూకల ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తమ ఆదేశాలు లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపుతాయని ఈ నేపథ్యంలో విద్యా విషయాల్లో జోక్యం సమంజసం కాదంటూ పిటిషన్లను కోర్టు కొట్టేసింది.
Published date : 07 Sep 2021 04:01PM