ఎండీ హోమియో సీట్ల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఆలిండియా కోటా ఎండీ హోమియో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మార్చి 20న నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లోని ఆలిండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. మార్చి 21న ఉదయం 10 గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు కళాశాలలవారీగా వెబ్ ఆ ప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ–2021 అర్హత సాధించిన అభ్యర్థు లు ఈ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింతసమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ https://tsmdayushaiq.tsche.in, www. knruhs.telangana.gov.inను చూ డాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి.
చదవండి:
Alert: నిరుద్యోగులూ మోసపోకండి.. ఉద్యోగాల ప్రకటన మేమివ్వలేదు
135 Jobs: గాంధీ మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Published date : 21 Mar 2022 03:47PM