యూనివర్శిటీల్లో యాప్స్, లైవ్ స్ట్రీమింగ్‌లతో ఆన్‌లైన్ క్లాసులు: సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు - నేడు కార్యక్రమం కింద మొదటి దశలో 15,800 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నాడు - నేడుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారని వెల్లడించారు. ఏప్రిల్ 25న తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడారు. గేట్ కోచింగ్ కూడా ఆన్‌లైన్ ద్వారా ఇచ్చేందుకు జేఎన్టీయూ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. స్కూళ్లకు కావాల్సిన యూనిఫామ్స్, పుస్తకాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
మంత్రి సురేష్ ఏం చెప్పారంటే..
మంత్రి సురేష్ ఏం చెప్పారంటే..
- రెండో దశలో స్కూళ్లతోపాటు జూనియర్ కాలేజీలు, వాటితోపాటు హాస్టళ్లను సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చాం. వాటికి సంబంధించి టెండర్ షెడ్యూల్స్, ఆర్థిక అనుమతులు, అంచనాలన్నింటిని త్వరితగతిన పూర్తి చేస్తాం.
- సప్తగిరి చానెల్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు విద్యామృతం అనే కార్యక్రమం ద్వారా వీడియో ప్రోగ్రామ్స్‌ను రూపొందించాం.
- అలాగే ఆల్ ఇండియా రేడియోలో రెయిన్ బో చానెల్ ద్వారా విద్యాకలశం కింద ఆన్‌లైన్ ఆడియో తరగతులు నిర్వహిస్తున్నాం.
- వర్సిటీల్లో కూడా యాప్స్, లైవ్ స్ట్రీమింగ్‌తో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించుకోవాలని వర్సిటీల వీసీలకు ఆదేశాలిచ్చాం.
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు కూడా అభ్యాస్ అనే యాప్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం.
Published date : 27 Apr 2020 03:45PM