Women Education: ఆఫ్గనిస్తాన్ అమ్మాయిల ఉన్నత విద్యకు ఓకే.. కో ఎడ్యుకేషన్‌కు నో..!
Sakshi Education
కాబూల్: దేశంలో అమ్మాయిలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను కొనసాగించొచ్చని, అయితే కో ఎడ్యుకేషన్ ఉండదని ఆఫ్గనిస్తాన్ తాత్కాలిక విద్యామంత్రి అబ్దుల్ బకీ హక్కానీ అన్నారు. బాలబాలికలకు వేర్వేరు పాఠశాలలు ఉంటాయన్నారు.
తాలిబన్లు గత పాలనలో బాలికల విద్యను నిషేధించారు. అయితే తామిప్పుడు మారిపోయామని... మహిళలు చదువు కోవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని ఈనెల 15న కాబూల్‌లోకి ప్రవేశించి దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న తాలిబన్లు చెప్పిన విషయం తెలిసిందే. ‘దేశ సంస్కతి, చారిత్రక విలువలను దష్టిలో పెట్టుకొని ఇస్లామిక్ పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తాం. అదే సమయంలో విద్యార్థులు ఇతర దేశస్తులతో పోటీపడేలా సిలబస్‌ను రూపొందిస్తాం’ అని ఆయన తెలిపారు.
Published date : 31 Aug 2021 03:40PM