Skip to main content

విశాఖలో ఉన్నత ప్రమాణాలతో ఐటీ వర్సిటీ

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో అత్యున్నత ప్రమాణాలతో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌‌స శాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 20 (గురువారం)నవిశాఖలో ప్రారంభమైన ‘ఎడ్‌‌జ కంప్యూటింగ్, ప్రాసెస్ ఆటోమేషన్ త్రూ రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0 అండ్ కాగ్నెటివ్ టెక్నాలజీ (ఈపీఐసీ)-2020’ సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) సీఎండీ పి.కె రథ్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలకు సాదర స్వాగతం పలుకుతామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె. రథ్ మాట్లాడుతూ పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
Published date : 21 Feb 2020 01:34PM

Photo Stories