విప్రో సీఈఓకే వేతనం ఎంతంటే..?
2020 జూలై 6 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్య కాలానికి డెలాపోర్ట్ ఈ వేతనాన్ని అందుకున్నట్లు సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇందులో ఒన్‌టైమ్ క్యాష్, స్టాక్ గ్రాంట్, ఆర్‌ఎస్‌యూ (రిస్ట్రక్టెడ్ స్టాక్ యూనిట్స్) ఒన్‌టైమ్ గ్రాంట్ కలిసి ఉన్నాయని తెలిపింది. అబిదాలి నీముచ్వాలా వారసునిగా జూలై 6వ తేదీన విప్రోలో చేరారు.
అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలో..
అంతకుముందు ఆయన క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటవ్‌గా పనిచేశారు. భారత్ ఐటీ సేవల రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 2020-21లో రూ.49.68 కోట్లు. 2019-20లో ఈ ప్యాకేజ్ రూ.34.27 కోట్లు. ఇక టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపాలన్ వేతనం 2020-21లో రూ.20.36 కోట్లు. కాగా, విప్రో చైర్మన్ రషీద్ ప్రేమ్‌జీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.61 మిలియన్ డాలర్ల వేతనం తీసుకుంటే, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అందుకున్న మొత్తం 1.01 మిలియన్ డాలర్లు.