Skip to main content

విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు వీరి అనుమతి తప్పనిసరి

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసింది.
సెప్టెంబ‌ర్‌ 30 వరకు విద్యాసంస్థల బంద్‌ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్‌, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Published date : 07 Sep 2020 06:28PM

Photo Stories