విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్: సబిత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.
జూనియర్ కళాశాలల్లో విద్యార్థి సమగ్ర అభివృద్ధికి బాట లు వేసేందుకు, ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం బోర్డు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను బుధవారం మంత్రి తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
Published date : 18 Mar 2021 05:40PM